ఖరారైన రాజ్ – డీకే తదుపరి సినిమా

ఖరారైన రాజ్ – డీకే తదుపరి సినిమా

Published on Apr 22, 2014 12:17 AM IST

Raj-and-Dk
తెలుగు వారైనప్పటికీ బాలీవుడ్ లో సెటిల్ అయిన దర్శక నిర్మాతలు రాజ్ – డీకే. ఇటీవలే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చిన ఈ యంగ్ డైరెక్టర్స్ నిర్మాతలుగా ‘డీ ఫర్ దోపిడీ’ సినిమాని నిర్మించారు. ఇప్పుడు వారి దృష్టిని మళ్ళీ బాలీవుడ్ పై పెట్టారు.

తాజా సమాచారం ప్రకారం రాజ్ – డీకే త్వరలోనే షాహిద్ కపూర్ హీరోగా ఓ సినిమాని డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం రాజ్ – డీకే సిల్ ఆలీఖాన్ – ఇలియానా జంటగా నటిస్తున్న సినిమాకి ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నారు. ఇది పూర్తవగానే షాహిద్ కపూర్ సినిమా సెట్స్ పైకి వెళుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు