
గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్ లో సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోంది. ఇటీవలే తన మూడవ సినిమా ‘మెయిన్ తెరా హీరో’ సినిమాతో విజయాన్ని అందుకుంది. దాంతో ఇలియానా చుట్టూ పుకార్లు మొదలయ్యాయి.
తాజాగా ఈ భామా ముంబై రోడ్స్ లో డూప్లికేట్ నెంబర్ ప్లేట్ తో కారు డ్రైవ్ చేస్తోందని అరెస్ట్ చేసారని పుకార్లు వినిపిస్తున్నాయి. అలాగే పోలీసులు కూడా ఆమెపై కేసు బుక్ చేసారని అంటున్నారు. కానీ ఇలియానా సన్నిహితులను కనుక్కుంటే ఈ విషయం పై క్లారిటీ వచ్చింది.
ఇదే విషయాన్ని ఇలియానా ముందు ప్రస్తావిస్తే ఆ వార్తలని కొట్టి పారేయడమే కాకుండా నాకు డూప్లికేట్ నేమబార్ తో కారు మెయిన్ టైన్ చెయ్యాలన్న అవసరం లేదు. అలాగే నిజానిజాలు తెలియకుండా మీడియా ఇలాంటి వార్తలు రాసిన మీడియాపై ఇలియానా ఫైర్ అయ్యింది.

