మోడీ కి శుభాకాంక్షలు తెలిపిన రజనీకాంత్

మోడీ కి శుభాకాంక్షలు తెలిపిన రజనీకాంత్

Published on May 16, 2014 4:34 PM IST

Rajini_Modi
ఉహించినట్టుగానే మోడీ నామాన్నిభారతదేశం జపం చేసింది. 2014 లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన బిజెపి ఏ పార్టీ మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.

మోడీ కి దేశం నలుమూలల నుండి అభినందలు వెల్లువెత్తుతున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా మోడీ ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభినందించారు.

“నరేంద్ర మోడీ గారు మీరు సాధించిన ఈ చారిత్రాత్మక విజయానికి హార్దిక శుభాకాంక్షలు” అని రజనీ ట్వీట్ చేసారు. అలాగే “ఘన విజయం సాధించిన తమిళ్ నాడు ముఖ్య మంత్రి జయ లలిత గారికి శుభాకాంక్షలు’ అని రజనీ ఇంకో ట్వీట్ చేసారు.

తాజా వార్తలు