
యంగ్ రెబల్ స్టార్ కొద్ది రోజుల క్రితం వరకూ ‘బాహుబలి’ షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. ప్రభాస్ నిన్న జరిగిన తన కజిన్ పెళ్ళికి హాజరయ్యాడు. ఈ పెళ్ళిలో ప్రభాస్ చేతికి కట్టుతో, అలాగే హ్యాండ్ సపోర్ట్ స్టిక్ దర్శనమిచ్చాడు. దాంతో వెంటనే ప్రభాస్ గాయపడ్డాడు అనే రూమర్స్ రావడం మొదలెట్టాయి.
ఈ విషయంపై ప్రభాస్ ఫేస్ బుక్ ద్వారా స్పందించి వస్తున్న రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టారు. ‘నేను ఒక నెల క్రితం షోల్డర్ సర్జరీ చేసుకున్నాను. చాలా రోజుల క్రితమే చేసుకోవాల్సిన ఈ సర్జరీని చాలా ఆలస్యం చేసి ఇప్పుడు చేసుకున్నాను. సర్జరీ సక్సెస్ఫుల్ గా జరిగింది. నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను. మరో నెల రోజుల్లో షూటింగ్ లో పాల్గొంటానని’ ప్రభాస్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసాడు.
2015లో రిలీజ్ కానున్న ‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్, రానా హీరోలుగా, అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఆర్కా మీడియా వారు నిమిస్తున్న ఈ భారీ బడ్జెట్ పీరియాడికల్ మూవీకి సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్నాడు.

