‘మనం’ రిలీజ్ కోసం ఒకింత టెన్షన్ పడుతున్న సమంత

‘మనం’ రిలీజ్ కోసం ఒకింత టెన్షన్ పడుతున్న సమంత

Published on May 22, 2014 1:41 PM IST

samantha
అక్కినేని ఫ్యామిలీ మూడు తరాల హీరోలు కలిసి చేసిన సినిమా ‘మనం’ రేపు భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వడానికి సిద్దమవుతోంది. ఈ రోజు హైదరబాద్ లో అభిమానుల కోసం స్పెషల్ ప్రీమియర్ షోస్ వేస్తున్నారు. ఎంతో మంది అభిమానులు, సినీ ప్రేమికులు ఈ మూవీ రిలీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సమంత ఈ మూవీ రిలీజ్ సందర్భంగా ఒకింత టెన్షన్ పడుతోంది. ‘మరో సినిమా రిలీజ్ కి సిద్దమైంది. ప్రీ రిలీజ్ టైం. కాస్త భయంగా ఉంది. మనం మీకందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నానని’ సమంత ట్వీట్ చేసింది.

ఎఎన్ఆర్, నాగార్జున, నాగ చైతన్య, సమంత, శ్రియ సరన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఓ అతిధి పాత్రలో కనిపించనున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు.

తాజా వార్తలు