
సెంటిమెంట్ల మధ్య నడిచే రంగంలో తెలుగు సినిమా రంగం ఒకటి. అలాంటి ఒక సెంటిమెంట్ ఏమిటంటే ఇప్పటి యువ హీరోల 7వ సినిమా పెద్ద విజయం సాధించడం. ఆ పరంపర నిజమని మరోసారి రుజువు అయ్యింది
ఉదాహరణకి జు. ఎన్.టి.ఆర్ కి సింహాద్రి, మహేష్ బాబు కి ఒక్కడు, రామ్ చరణ్ కి ఎవడు, పవన్ కళ్యాణ్ కి ఖుషి సినిమాలు తమతమ కెరీర్ లో నటించిన 7వ చిత్రాలు. ఇవన్నీ ఘన విజయం సాధించాయని మనకు తెలిసినదే
ఇప్పుడు ఈ జాబితాలో నాగచైతన్య కూడా కలిసాడు. అతని 7వ సినిమా ‘మనం’ సూపర్ డూపర్ హిట్ టాక్ ని సంపాదించి చైతు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కాబట్టి ఈ సెంటిమెంట్ ఇంకా నిజమనే నమ్ముదాం

