మెగా హీరోలలో ఒకరైన సాయి ధరమ్ తేజ్ రెజినా సరసన ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలో విడుదలకానుంది. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఆడియో త్వరలో విడుదలకానుంది
విభిన్న కధనంతో తెరకెక్కే ఒక ప్రేమకధగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఏ.ఎస్ రవికుమార్ చౌదరి ఈ సినిమాకు దర్శకుడు. హర్షిత రెడ్డి, బన్నీ వాస్ లు నిర్మాతలు
ఈ సినిమాలో శ్రీహరి పోషించాల్సిన ఒక ముఖ్యపాత్రను జగపతిబాబు భర్తీ చేసాడు. ఈ పాత్ర సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సమాచారం


