‘రా రా కృష్ణయ్య’లో లిప్ లాక్ చేయనున్న రెజినా, సందీప్ కిషన్ లు

‘రా రా కృష్ణయ్య’లో లిప్ లాక్ చేయనున్న రెజినా, సందీప్ కిషన్ లు

Published on May 28, 2014 6:49 PM IST

sandepkishan
‘వేంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమా హిట్ తో మంచి ఉపు మీద ఉన్న సందీప్ కిషన్ ప్రస్తుతం ‘రా రా కృష్ణయ్య’ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో సందీప్ సరసన రెజినా కాసాండ్రా హీరోయిన్ గా నటిస్తుంది. దీనికి ముందు వీరిద్దరూ కలిసి చేసిన సినిమా ‘రొటీన్ లవ్ స్టొరీ’. ఆ సినిమాలో వీరిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీకి మంచి పేరు వచ్చింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం ‘రా రా కృష్ణయ్య’ సినిమాలో ఈ జంట లిప్ లాక్ చేయనున్నారట.

జగపతి బాబు ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమా జూన్ నెలలో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు