స్వాతి తదుపరి చిత్రం పేరు ‘కుల్ఫీ’

స్వాతి తదుపరి చిత్రం పేరు ‘కుల్ఫీ’

Published on Jun 3, 2014 8:00 PM IST

swathi1
ప్రస్తుతం స్వాతి ‘కార్తికేయ’ సినిమా ప్రమోషన్ లో బిజీగా వుంది. ఇదిలావుండగానే తన తమిళ చిత్రం ‘కుల్ఫీ’ విడుదలకు సిద్దం అయింది. ఈ చిత్రంలో ‘జర్నీ’ ఫేం జై హీరోగా నటించాడు.

డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆడియో జూన్ 9న విడుదల అవ్వనుంది. యువన్ శంకర్ రాజ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని నరసింహరెడ్డి సమాల నిర్మించారు.

‘కుల్ఫీ’ తమిళ మాతృక పేరు ‘వడా కర్రీ’. ఈ చిత్రం అక్కడ ఘనవిజయం సాధించింది. లహరి మ్యూజిక్ ఈ చిత్రం ఆడియో హక్కుల్ని సంపాదించింది. ఈ చిత్రం విడుదల తేది ఇంకా ప్రకటించాల్సి వుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు