
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమవుతున్న నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘గొల్లభామ’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ యానాంలో జరుగుతోంది. అక్కడ ప్రధాన తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్ లో వరుణ్ తేజ్ తో పాటు హీరోయిన్ పూజ హెగ్డే, ప్రధాన నటీనటులు కూడా పాల్గొంటున్నారు.
ఇటీవలే భీమవరంలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీం యానాంకి షిఫ్ట్ అయ్యింది. ఇక్కడ ఎండా వేడిమికి తట్టుకుంటూ కూడా ఈ చిత్ర టీం ఆగకుండా షూటింగ్ చేస్తున్నారు. సున్నితమైన బావోద్వేగాలతో కూడిన కుటుంబకథా చిత్రాలను తీసిన శ్రీ కాంత్ అడ్డాల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఠాగూర్ మధు మరియు నల్లమలుపు బుజ్జి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

