వేగవంతమైన బాహుబలి పోస్ట్ ప్రొడక్షన్

వేగవంతమైన బాహుబలి పోస్ట్ ప్రొడక్షన్

Published on Jun 15, 2014 5:27 PM IST

Baahubali-war-schedule-wrap
తెలుగు చలన చిత్ర రంగంలోనే మొట్ట మొదటి సారిగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా బాహుబలి. ఈ సినిమా 2015లో రిలీజ్ కానుంది. ఈ చిత్ర టీం ఈ సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసింది. ఈ సినిమాలో స్పెషల్ ఎఫెక్ట్స్ ఉన్న సీన్స్ ఎక్కువగా ఉంటాయి. దాంతో రాజమౌళి ఇంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలు పెట్టాడు. రాజమౌళి తీసిన ఈగ విడుదల కూడా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల వల్ల ఆలస్యం అయ్యింది.

ఇటీవలే ఈ చిత్ర టీం ఈ చిత్ర టెక్నీషియన్స్ అందరూ కలిసి పని చేస్తున్న ఫోటోని కూడా పోస్ట్ చేసారు. ప్రస్తుతం షూటింగ్ బ్రేక్ లో ఉన్న ఈ చిత్ర టీం ఈ సారి ప్రభాస్ పూర్తిగా కోలుకోగానే తదుపరి షెడ్యూల్ మొదలవుతుంది. రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తుంటే రానా విలన్ పాత్రలో కనిపించనున్నాడు. అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు