
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రుద్రమదేవి’ సినిమా ఈ సంవత్సరం సెకండాఫ్ లో రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. ఈ సినిమా కోసం ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ పనిచేస్తున్న విషయం ఇది వరకే తెలియజేశాం. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం తెలిపిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో అందరినీ ఆశ్చర్య పరిచేలా, అదిరిపోయే రేంజ్ లో 3డి ఎఫెక్ట్స్ ఉంటాయని అంటున్నారు.
ఇండియాలోనే మొదటి సారిగా తెరకెక్కిన హిస్టారికల్ 3డి సినిమా అని గుణశేఖర్ మూవీని ప్రమోట్ చేస్తున్నారు. అలాగే 3డి ఎఫెక్ట్స్ పై ఎక్కువ శ్రద్ధ కూడా తీసుకుంటున్నారు. అందుకోసమే 3డి ఎఫెక్ట్స్ కోసం ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు.
అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అనుష్కకి జోడీగా రానా నటిస్తున్నాడు. అలాగే అల్లు అర్జున్, కృష్ణం రాజు, నిత్యా మీనన్, హంసా నందిని, కేథరీన్ త్రేసాలు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీకి తోట తరణి మ్యూజిక్ అందిస్తున్నాడు.

