సమీక్ష  : లీడర్‌ – రెగ్యులర్ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ !

సమీక్ష  : లీడర్‌ – రెగ్యులర్ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ !

Published on Apr 4, 2026 7:38 PM IST

Leader

విడుదల తేదీ : ఏప్రిల్ 03, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : శరవణన్, పాయల్‌ రాజ్‌పుత్, శ్యామ్, ఆండ్రియా, సంతోష్‌ ప్రతాప్, లాల్, బాహుబలి ప్రభాకర్, అమృత అయ్యర్, వీటీవీ గణేశ్, ఐశ్వర్య తదితరులు..
దర్శకుడు : ఆర్‌ఎస్‌ దురై సెంథిల్‌ కుమార్‌
నిర్మాణ సంస్థ: లెజెండ్‌ శరవణ స్టోర్స్‌ ప్రొడక్షన్స్‌
సంగీతం : జిబ్రాన్‌
ఛాయాగ్రహణం : ఎస్‌.వెంకటేశ్‌
ఎడిటింగ్ : అనిల్ పసల

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

ప్రముఖ వ్యాపారవేత్త అరుళ్‌ శరవణన్‌ హీరోగా వచ్చిన సినిమా ‘లీడర్‌’.  కాగా ఈ చిత్రం తెలుగులో కూడా రిలీజ్ అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ : 

శక్తివేల్‌ (శరవణన్‌)  కారు మెకానిక్‌గా పని చేస్తుంటాడు. తన కూతురు అయిరేని (ఇయల్‌) అంటే అతనికి పంచప్రాణాలు. ఐతే, తన కూతురికి  వినికిడి లోపం. దీంతో తన కూతురికి ఆపరేషన్‌ చేయించాలనే ప్రయత్నాల్లో ఉంటాడు శక్తివేల్. ఈ క్రమంలో వచ్చే కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పోలీస్‌ అధికారిణి ఇంద్రా సత్యమూర్తి (ఆండ్రియా) తూత్తుకూడి పోర్టులో సాల్ట్‌ (బాహుబలి ప్రభాకర్‌) చేసే అక్రమ కార్యకలాపాల్ని బయట పెట్టేందుకు శక్తివేల్‌ సాయం కోరుతుంది. కానీ, దానికి అతను నిరాకరిస్తాడు. ఐతే, ఆ తర్వాత అతని కూతురు ఆపదలో పడుతుంది. తన కూతుర్ని కాపాడుకునేందుకు శక్తివేల్‌ ఏం చేశాడు ?, ఇంతకీ అతని గతం ఏమిటి ?, అతని భార్య మీరా (పాయల్‌ రాజ్‌పుత్‌)ని ఎవరు చంపారు ?, అసలు శక్తివేల్‌ ఎవరు ? చివరకు ఈ కథ ఎలాంటి మలుపులు తిరిగింది ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :  

ఈ సినిమాలో తండ్రీ – కూతురు అనుబంధాలను బాగా చూపించారు. అలాగే కొన్ని స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలిమెంట్స్ కూడా బాగానే ఉన్నాయి. శరవణన్‌ చాలా పవర్ ఫుల్ గా కనిపించడానికి బాగానే కష్టపడ్డాడు. ఐతే, తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ..  నటించి ఉంటే ఇంకా బాగుండేది. తన పాత్రకు మాత్రం న్యాయం చేయడానికి శరవణన్‌ గట్టిగా ప్రయత్నం చేశాడు. ఇక రా ఏజెంట్‌గా తన 12th మెన్‌ స్క్వాడ్‌ బృందంతో కలిసి హీరో చేసే సాహసాలు కూడా బాగున్నాయి.

నిజానికి  రా ఏజెంట్‌ ఆపరేషన్స్‌ ఎంత థ్రిల్లింగ్‌గా ఉంటే ప్రేక్షకుల్లో అంత ఆసక్తిగా చూస్తారు. ఈ సినిమాలో థ్రిల్లింగ్‌ ను బాగానే ఎలివేట్ చేశారు. హీరోయిన్ పాయల్‌ పాత్రకు నిడివి తక్కువే, అయినప్పటికీ ఆమె తన పాత్రకు న్యాయం చేసింది. ఇతర కీలక పాత్రల్లో నటించిన ఆండ్రియా, లాల్, శ్యామ్, అమృత అయ్యర్‌ తదితరులు చాలా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా  తమ పాత్రల  పరిధి మేరకు బాగా నటించారు.

మైనస్ పాయింట్స్:

ఈ లీడర్‌  సినిమాలో ఇంట్రెస్టింగ్ డ్రామాకి స్కోప్ ఉన్నా.. కొన్ని చోట్ల ప్లే మాత్రం చాలా సింపుల్ గా సాగుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ను ఇంకా బలంగా రాసుకుని ఉండాల్సింది. అలాగే, అనవసరమైన ల్యాగ్ సీన్స్ కూడా ఎక్కువైపోయాయి. పైగా  ఈ సినిమా  స్లో నేరేషన్ తో  పాటు బోరింగ్ ట్రీట్మెంట్ అండ్ ఫేక్ ఎమోషన్స్ తో  సాగుతుంది. సినిమాలో మెయిన్ పాయింట్ ను ఇంకా బలంగా డిటైల్డ్ గా ఎస్టాబ్లిష్ చేసి కన్వెన్స్ చేయాల్సింది.

ఇక ప్రీ క్లైమాక్స్ ని కాస్త ఎమోషనల్ గా  నడుపుదామని దర్శకుడు ఆర్‌ఎస్‌ దురై సెంథిల్‌ కుమార్‌ బాగానే ప్రయత్నం చేశాడు, కాకపోతే  పూర్తి స్థాయిలో ఎక్కడా  ఆ ఎమోషన్ వర్కౌట్ కాలేదు. పైగా సిల్లీ ఎమోషన్స్ చుట్టూ పేలవమైన సీన్స్ తో సినిమాని సాగదీశారు. మొత్తమ్మీద  ఈ లీడర్ మూవీ మేకర్స్  తాము  అనుకున్న కంటెంట్ ను  స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసినా..  కొన్ని సీన్స్ విషయంలో బాగాలేదు. అలాగే క్లైమాక్స్  లోని సీన్స్ కూడా ఆకట్టుకోవు. అటు వీటీవీ గణేష్‌ లాంటి కమెడియన్‌ ఉన్నా పెద్దగా నవ్వులు పండలేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు ఆర్‌ఎస్‌ దురై సెంథిల్‌ కుమార్‌ మంచి క్రైమ్ థ్రిల్లర్ కి  గుడ్ ట్రీట్మెంట్ ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. ప్లే ఇంకొంచెం బెటర్ గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో ఎస్‌.వెంకటేశ్‌ సినిమాటోగ్రఫీ బాగుంది.  మూవీ ఓపెనింగ్ దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా నేచురల్ గా చూపించారు. జిబ్రాన్‌ సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం కూడా పర్వాలేదు. ఎడిటింగ్ ఇంకా బెటర్ ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాత ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.

తీర్పు :

‘లీడర్’ అంటూ వచ్చిన ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ లో కొన్ని యాక్షన్ సీన్స్ పర్వాలేదు. అలాగే ఫస్ట్ హాఫ్ మెయిన్ సీక్వెన్స్ ఓకే అనిపించినా..  స్క్రీన్ ప్లే స్లోగా సాగడం, కొన్ని కీలక సన్నివేశాల్లో లాజిక్ మిస్ కావడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. మొత్తమ్మీద ఈ స్పై యాక్షన్‌ డ్రామాలో కేవలం కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఓకే అనిపిస్తాయి.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు