శర్వానంద్ ని పొగిడిన ప్రభాస్

శర్వానంద్ ని పొగిడిన ప్రభాస్

Published on Jun 17, 2014 2:48 AM IST

prabas-sarvanand
యువ రెబెల్ స్టార్ ప్రభాస్ కి అస్సలు అహం ఉండదు అని అందరికి తెలుసు. ఇతర హీరోలను పొగుడుతూ వాళ్ళు చేసిన కృషి ని మెచ్చుకుంటూవుంటాడు. ఈ మాచో హీరో తన మంచితనాన్ని ‘రన్ రాజా రన్’ ఆడియో రిలీజ్ లో మరోసారి ప్రదర్శించాడు.

ప్రభాస్ శర్వానంద్ ఎంతో ప్రొఫెషనల్ గా వుండడంతో పాటు అందరికి సహకరిస్తాడని మెచ్చుకున్నాడు. అంతేకాకుండా శర్వా సినిమా పూర్తి అయ్యేంతవరకు నిర్మాతలు సినిమా నాణ్యతలో రాజీ పడకుండా తోడ్పడేందుకు తన రెమ్యునరేషన్ కూడా తీసుకోడని తెలిపాడు.

‘రన్ రాజా రన్’ చిత్రాన్ని ప్రభాస్ స్నేహితులు వంశీ మరియు ప్రమోద్ లు నిర్మించారు. ఈ స్టైలిష్ రొమాంటిక్ చిత్రానికి ఘిబ్రన్ సంగీతం అందించారు.

తాజా వార్తలు