ఆగష్టు మొదటి వారంలో ‘కరెంట్ తీగ’ ఆడియో

ఆగష్టు మొదటి వారంలో ‘కరెంట్ తీగ’ ఆడియో

Published on Jun 29, 2014 10:37 PM IST

Current-Teega
మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న ‘కరెంట్ తీగ’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మనోజ్ సరసన రాకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘సీమశాస్త్రి’, ‘దేనికైనా రెడీ’ సినిమాల దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సన్నీ లియోన్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది.

మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ సినిమా ఆడియోని ఆగష్టులో రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. పూర్తి కామెడీ ఎంటర్టైనర్ ఉంటున్న ఈ సినిమాలో మనోజ్ పాత్ర బాగా ఎనర్జిటిక్ గా ఉంటుందని సమాచారం. ఇటీవలే మంచు మనోజ్ – సన్నీ లియోన్ మధ్య సన్నివేశాలను షూట్ చేసారు.

తాజా వార్తలు