‘ఆగడు’ స్పెషల్ సాంగ్ అదుర్స్ – తమన్

‘ఆగడు’ స్పెషల్ సాంగ్ అదుర్స్ – తమన్

Published on Jul 17, 2014 2:54 AM IST

thaman
సూపర్ స్టార్ మహేష్ బాబు, శృతి హాసన్ కలసి చిందేస్తున్న సినిమా ‘ఆగడు’. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ‘ఆగడు’లో శృతి హాసన్ స్పెషల్ సాంగ్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాట కోసం సంగీత దర్శకుడు తమన్ అదిరిపోయే ట్యూన్ రెడీ చేశాడంట. దర్శకుడు శ్రీను వైట్ల సూచనలు, సలహాలతో పాట మరింత ఎనర్జిటిక్ గా వచ్చిందని తమన్ ట్విట్టర్లో తెలిపారు.

జూలై 18 నుండి మహేష్, శృతిలపై ఈ పాటను షూట్ చేయనున్నారని సమాచారం. ప్రేక్షకులలో సినిమాల పంచ్ డైలాగుల ప్రభావంతో పాటు ఐటెం సాంగుల ప్రభావం కూడా ఎక్కువే ఉంది. 4 నిముషాల ఉండే ఐటెం సాంగ్ సినిమాకు స్పెషల్ క్రేజ్ తీసుకొస్తున్నాయి. మహేష్, శృతి స్పెషల్ సాంగ్ అనగానే సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి.

‘ఆగడు’ చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. స్పెషల్ సాంగ్ చిత్రీకరణ పూర్తవగానే మూవీ యూనిట్ నార్వేకి షిఫ్ట్ అవుతుంది. మహేశ్, తమన్నాలపై 2 పాటలను తెరకేక్కిస్తారు. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తిచేసి సినిమాను సెప్టెంబర్ 19న విడుదల చేయనున్నారు. ఆడియో ఆగస్ట్ రెండవ వారంలో విడుదల చేసే అవకాశం ఉంది.

తాజా వార్తలు