‘దృశ్యం’తో తెలుగులో మార్పు మొదలైంది – రానా

‘దృశ్యం’తో తెలుగులో మార్పు మొదలైంది – రానా

Published on Jul 17, 2014 10:00 AM IST

Rana_Daggubati

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా రూపొందిన చిత్రం ‘దృశ్యం’. ప్రయోగాత్మక చిత్రాలలో నటించడానికి ఎప్పుడూ ఒక అడుగు ముందుండే విక్టరీ వెంకటేష్ నటించిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలై ప్రేక్షకుల మన్ననలు పొందింది. తెలుగులోఒక స్టార్ హీరో ఇటువంటి ప్రయోగం చేయడం సాహసమనే చెప్పాలి. ‘దృశ్యం’ విజయం సాదించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు హీరో రానా.

‘ సినిమా షూటింగ్ మొదలుపెట్టినప్పుడు మాలో కొన్ని సందేహాలు ఉన్నాయి. తెలుగులో ‘దృశ్యం’ వంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. సినిమాలో కధే మెయిన్ హీరో. పాటలు ఉండవు, ఒక థీమ్ మీద గ్రిప్పింగ్ స్క్రీన్-ప్లేతో సాగిపోయే ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లర్ సినిమా ఇది. తెలుగు ప్రేక్షకులకు ఇటువంటి సినిమాలు కొత్త. బాబాయి(వెంకటేష్).. హీరోగా కాకుండా క్యారెక్టర్ గా, ఇద్దరు పిల్లల తండ్రిగా సినిమా చేయడం కొత్త అబుభూతిని కలిగించింది. ప్రయోగాత్మక సినిమా అయినా ప్రేక్షకులు ఒక బిగ్ కమర్షియల్ సినిమాలా ఆదరించారు. తెలుగు చిత్రాలలో ట్రెండ్ చేంజ్ అయ్యింది, మార్పు మొదలైంది అనడానికి ఇదే నిదర్శనం. సినిమా విజయం సాదించడం చాల అనందంగా ఉందని ‘ రానా తెలిపారు.

తాజా వార్తలు