
నాగ చైతన్య, పూజా హెగ్డే జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని ఫ్యామిలీ నిర్మిస్తున్న చిత్రం ‘ఒక లైలా కోసం’. ‘గుండె జారి గల్లంతయ్యింది’ తర్వాత విజయ్ కుమార్ కొండ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇటివల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. సినిమా చూసిన కింగ్ నాగార్జున సంతోషంగా ఉన్నారు. దర్శకుడి విజయ్ కుమార్ కొండపై ప్రసంశల జల్లు కురిపించారు.
‘మనం’, ‘ఆటో నగర్ సూర్య’ చిత్రాలు విజయవంతం కావడంతో మంచి జోరు మీద ఉన్నాడు నాగ చైతన్య. ఇదే జోరు ‘ఒక లైలా కోసం’ సినిమాతో కంటిన్యూ చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. త్వరలో ఆడియో, మూవీ విడుదల వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

