యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఇప్పటివరకూ ఎన్నో సెన్సేషన్స్ క్రియేట్ చేసాడు. ఇకపై తను ఇంకో 15 సంవత్సరాలకు పైనే ఇండస్ట్రీలో కొనసాగే అవకాశం ఉంది. ఆయన తాజాగా రైటర్స్ అందరికీ 40-50 వయసుగల హీరోస్ కి మెచ్యూరిటీ ఉన్న రోల్స్ రాయాలని సూచించారు. ప్రస్తుతం సౌత్ ఇండియాలో చాలా మంచి బిగ్ స్టార్స్ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడిప్పుడే మల్టీ స్టారర్ సినిమాలపై ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు రొమాంటిక్ హీరోస్ లా కనిపించడం కాస్త కష్టమైన పని. అందుకే కమల్ రైటర్స్ కి ఒక సెపరేట్ జోనర్ క్రియేట్ చేయమని అంటున్నారు.
‘ప్రస్తుతం రైటర్స్ అంతా యంగ్ హీరోస్ ని దృష్టిలో పెట్టుకొని కథలు రాస్తున్నారు. వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే.. మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని కథలు రాసుకోండి. అప్పుడే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి. ఉదాహరణకి బాలీవుడ్ వాళ్ళు అమితాబ్ బచ్చన్ కి ఇప్పటికీ మంచి కథలని అందిస్తున్నారని’ అన్నాడు. కమల్ హాసన్ ప్రస్తుతం ‘విశ్వరూపం 2’, ‘ఉత్తమ విలన్’ సినిమాల్లో నటిస్తున్నాడు.


