
ప్రస్తుతం టాలీవుడ్ లో అనుష్క నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక సినిమా ‘రుద్రమదేవి’. తాజాగా నానక్రామ్ గూడా లో వేసిన రుద్రమదేవి సెట్ లో నుంచి చాలా ఖరీదైన బంగారు నగలు మరియు వెండికి బంగారు కోటింగ్ వేసిన నగలు నిన్న సాయంత్రం మిస్ అయ్యాయి. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు ప్రస్తుతం ఇన్వెస్టిగేషణ్ చేస్తున్నారు.
ఈ సినిమా కోసం బెంగుళూరు నుంచి ఓ వ్యక్తి ఈ అంగాలని తెచ్చాడు. షూటింగ్ బ్రేక్ టైం లో కార్ వాన్ లో నగలను పెట్టారు. మామూలుగా కార్ వాన్ లేదా ఫిల్మ్ సెట్ నుంచి ఒక బాగ్ ని అది కూడా ఒకటిన్నర కేజీ బంగారం ఉన్న బాగ్ ని తీసుకెళ్లడం చాలా కష్టమైన పని.
కావున ప్రస్తుతం పోలీసులు అవి సెట్లోనే ఎక్కడో ఒక చోట దాచి పెట్టి ఉంటారని గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతానిక్ బయటి వారిని ఎవరిని ఇందులో ఇన్వాల్వ్ చెయ్యలేమని పోలీసు ఇన్స్పెక్టర్ అంటున్నారు. గుణశేఖర్ నిర్మిస్తున్న ఈ సినిమాని అంత్యంత భారీ బడ్జెట్ తో స్టార్ట్ కాస్టింగ్ తో సినిమాని నిర్మిస్తున్నారు.

