యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న ‘రభస’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాలోని చివరి పాట షూటింగ్ నేటితో స్విట్జర్ ల్యాండ్ లో పూర్తి కానుంది. ముందుగా ఈ సినిమా ఆడియోని జూలై 27వ రిలీజ్ చేయాలనుకున్నారు కానీ దానిని కాస్త వాయిదా వేసి ఆగష్టు 1న రిలీజ్ చేయనున్నారు. ఈ ఆడియో విడుదల కార్యక్రమం శిల్పకళా వేదికలో అభిమానుల సమక్షంలో నిర్వహించనున్నారు.
ఎన్.టి.ఆర్ సరసన సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి సంతోష్ శ్రీనివాస్ డైరెక్టర్. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రేక్షకులకు కావలసినంత కామెడీ కూడా ఉంటుందని ఈ చిత్ర టీం చెబుతోంది. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి బెల్లంకొండ సురేష్ నిర్మాత. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.


