అల్వాల్ లో సందడి చేస్తున్న కళ్యాణ్ రామ్ ‘షేర్’

అల్వాల్ లో సందడి చేస్తున్న కళ్యాణ్ రామ్ ‘షేర్’

Published on Jul 20, 2014 4:45 PM IST

kalyanram-share

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం రెండు సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అందులో ఒక దానికి ‘షేర్’ అనే పవర్ఫుల్ టైటిల్ ని పెట్టారు. గతంలో కళ్యాణ్ రామ్ ‘కత్తి’ సినిమాకి దర్శకత్వం వహించిన మల్లి కార్జున్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఇటీవలే మొదలైంది. ప్రస్తుతం అల్వాల్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. అక్కడ ప్రముఖ నటులపై కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.

కళ్యాణ్ రామ్ సరసన వన్య మిశ్ర హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని కొమర వెంకటేష్ నిర్మిస్తున్నారు. కళ్యాణ్ రామ్ ఈ సినిమా కాకుండా ‘పటాస్’ సినిమాని కూడా ఒకే సమయంలో పూర్తి చేయడానికి ట్రై చేస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ‘పటాస్’ లో శృతి సోది హీరోయిన్ గా నటిస్తోంది.

తాజా వార్తలు