2015 సంక్రాంతికి టాలీవుడ్ బాక్స్ ఆఫీసు వద్ద ఒక భారీ యుద్ధం జరగనుంది. గత కొద్ది రోజుల క్రితం వరకూ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందే సినిమాని 2015 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనుకున్నారు. తాజాగా సంక్రాంతి సీజన్ లో పవన్ కళ్యాణ్ – వెంకటేష్ ల ‘గోపాల గోపాల’ కూడా వచ్చి చేరింది.
ముందుగా ‘గోపాల గోపాల’ని దసరా కానుకగా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం 2015 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఈ చిత్ర టీం నిర్ణయం తీసుకుంది. దీంతో ఎన్.టి.ఆర్ సినిమాకి – పవన్ – వెంకీలు కలిసి నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి మధ్య గట్టి పోటీ నెలకొంది. టాలీవుడ్ కి బాగా ఫేవరైట్ సీజన్ గా చెప్పుకునే ఈ సీజన్ లో రెండు పెద్ద స్టార్స్ సినిమాలు మామూలుగా తలపడుతూనే ఉంటాయి. రానున్న నెలల్లో మరెవరన్నా ఇదే సీజన్ లో తమ సినిమాలను రిలీజ్ చెయ్యడానికి ట్రై చేస్తారేమో చూడాలి..


