లిరిక్ రైటర్ కృష్ణ చైతన్య దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘రౌడీ ఫెలో’. నారా రోహిత్ ‘రౌడీ ఫెలో’గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, అన్నగారు ఎన్టీఆర్ నటించిన ‘భలే తమ్ముడు’లోని ‘ఎంతవారుగాని.. వేదాంతులైనాగాని.. వాలు చూపు తాకగానే’ పాటను పాటను సన్నీ సంగీత సారధ్యంలో రీమిక్స్ చేస్తున్నారు.
ట్రెండ్ పేరుతో పాటను కూని చేయడం లేదు. మహమద్ రఫీ గానం, సి.నారాయణ రెడ్డి సాహిత్యం పాటను పది తరాలు గుర్తుంచుకునేలా, ఒక ఆణిముత్యంలా నిలిపాయి. వాటి మాధుర్యం ఏమాత్రం మిస్ అవకుండా రీమిక్స్ చేస్తున్నాం. అన్ని తరాల ప్రేక్షకులను సన్నీ రీమిక్స్ సాంగ్ ఆకట్టుకుంటుంది అని దర్శకుడు కృష్ణ చైతన్య తెలిపారు. ప్రస్తుతం ‘రౌడీ ఫెలో’ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.


