‘గమ్యం’ సినిమాతో తన టాలెంట్ ని టాలీవుడ్ కి పరిచయం చేసిన డైరెక్టర్ క్రిష్. ప్రస్తుతం క్రిష్ తమిళ సినిమా ‘రమణ’ని హిందీలో రీమేక్ చేసే పనిలో ఉన్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అక్షయ్ కుమార్, శృతి హాసన్ జంటగా నటించిన ఈ సినిమాని సంజయ్ లీల భన్సాలి నిర్మిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం క్రిష్ మరో తమిళ సినిమాని రీమేక్ చేయడంలో ఆసక్తి చూపుతున్నాడు.
విషయంలోకి వెళితే ఎఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ‘సైవం’ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయంతో పాటు విమర్శకుల ప్రశంశలను కూడా అందుకుంది. ఈ విషయంపై క్రిష్ ఇంకా అధికారిక ప్రకటన వెలువరించలేదు. క్రిష్ తెలుగులో చివరిగా చేసిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమా కమర్షియల్ గా విజయాన్ని అందుకుంది. మరి క్రిష్ బాలీవుడ్ లో పరిచయం అవుతూ చేస్తున్న సినిమా విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి..


