సెన్సార్ కి రెడీ అయిన ఎన్టీఆర్ ‘రభస’.

సెన్సార్ కి రెడీ అయిన ఎన్టీఆర్ ‘రభస’.

Published on Aug 18, 2014 5:20 PM IST

Rabhasa
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా సినిమా ‘రభస’ సెన్సార్ కి రెడీ అయింది. ఆగస్ట్ 15న విడుదల చేయాలనుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో ఆగస్ట్ 29న విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలు దాదాపు పూర్తవడంతో ఈ నెల 21న సెన్సార్ కంప్లీట్ చేయాలని భావిస్తున్నారట దర్శకనిర్మాతలు. అందుకోసం ఫస్ట్ కాపీని సిద్దం చేస్తున్నారు.

‘రభస’ ఆడియోలో ఎన్టీఆర్ పాడిన రాకాసి రాకాసి పాట అభిమానులను అలరిస్తుంది. మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలతో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తీర్చిదిద్దారని సమాచారం. యాక్షన్ తో పాటు సెంటిమెంట్, కామెడీకి సమ ప్రాధాన్యం ఇచ్చారట. ‘కందిరీగ’ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంత, ప్రణిత హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతం అందించారు. బెల్లంకొండ సురేష్ నిర్మాత.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు