
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ‘రెడీ’, ‘దూకుడు’ లాంటి మొదలైన సినిమాలకు రైటర్ గా పనిచేసిన కోన వెంకట్ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ రైటర్స్ లో ఒకరు. కోన వెంకట్ డైలాగ్స్ రాసిన ‘గీతాంజలి’ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటి వరకూ టాలీవుడ్ లోనే బిజీ అయిన కోన వెంకట్ ఇకపై బాలీవుడ్ లో కూడా బిజీ కానున్నాడు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కోన బాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ ‘ ‘రెడీ’ సినిమా నాకు బాలీవుడ్ లో మంచిగుర్తింపు తెచ్చింది. ఇది కాకుండా సల్మాన్ ఖాన్ నటించనున్న ‘నో ఎంట్రీ బై ఎంట్రీ’ అనే సినిమాకి కథ అందించాను. అది డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్తుంది. ఇది కాకుండా అభిషేక్ బచ్చన్ కి ఓ కథని చెప్పాను, అలాగే శ్రీదేవికి కూడా ఓ పాయింట్ చెప్పాను. అది ఆమెకు బాగా నచ్చడంతో కథ సిద్దం చేయమన్నారని’ అన్నాడు.
మరి త్వరలోనే శ్రీదేవికి కోన పూర్తి కథని చెబుతాడని భావించవచ్చు. టాలీవుడ్ లో తన కంటూ ఓ ప్రత్యేక మార్క్ వేసుకున్న కోన వెంకట్ బాలీవుడ్ లోనూ అదే మార్క్ ని కొనసాగించాలని ఆశిద్దాం..

