యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో రూపొందుతున్న సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఆగష్టు 2 నుంచి ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ లో ఎన్.టి.ఆర్ ఇటీవలే జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ రోజు ఎన్.టి.ఆర్, వెన్నెల కిషోర్ తదితర నటీనటులపై కొన్ని కామెడీ సీన్స్ ని షూట్ చేసారు.
బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ ‘బాద్షా’ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మొదటి సారి వక్కంతం వంశీ అందించిన కథకి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా 2015 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
ఇది కాకుండా ఎన్.టి.ఆర్ – సమంత – ప్రణిత నటించిన ‘రభస’ సినిమా ఆగష్టు 29న పేక్షకుల ముందుకు రానుంది. సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

