చివరి దశకు చేరుకున్న ‘దిక్కులు చూడకు రామయ్యా’

చివరి దశకు చేరుకున్న ‘దిక్కులు చూడకు రామయ్యా’

Published on Aug 28, 2014 7:30 PM IST

dikkulu_choodaku_ramayya
‘ఈగ’, ‘అందాల రాక్షసి’, ‘లెజెండ్’, ‘ఊహలు గుసగుసలాడే’ లాంటి ప్రేక్షకులు మెచ్చే సినిమాలు తీసిన సాయి కొర్రపాటి మరోసారి యువ టాలెంట్ తో తన వారాహి చలన చిత్రం బానర్ పై నిర్మిస్తున్న సినిమా ‘దిక్కులు చూడకు రామయ్య’. ‘ఊహలు గుసగుసలాడే’ ఫేం నాగ శౌర్య హీరోగా, సన ని హీరోయిన్ గా పరిచయం చేస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఎస్ఎస్ రాజమౌళి దగ్గర పనిచేసిన త్రికోఠి దర్శకుడిగా పరిచయం కానున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ని వినాయక చవితి కానుకగా రిలీజ్ చేయనున్నారు.

సాయి కొర్రపాటి చిన్న సినిమా అయినా కథకి అన్యాయం జరగకూడదని అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టి ఈ సినిమా చేస్తున్నారు. ఈ మూవీకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. కీరవాణి అందించిన పాటలు అద్భుతంగా ఉన్నాయని ఈ చిత్ర టీం సన్నిహితులు చెబుతున్నారు. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలు పెట్టి అక్టోబర్ 1న ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. అజయ్, నిన్నటి తరం హీరోయిన్ ఇంద్రజ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు