సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఆగడు సినిమా రికార్డు లెవెల్లో విడుదలకు సిద్ధమవుతుంది. ఆంద్ర ప్రదేశ్, తెలంగాణా మార్కెట్ లలోనే కాక ఓవర్ సీస్ లో సైతం భారీ స్క్రీన్ ల సంఖ్యతో మనముందుకు రానుంది
ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ వరల్డ్ వైడ్ రిలీజ్ పై దృష్టిపెట్టి అన్ని ఏరియాలలో డే 1 రికార్డును తుడిచిపెట్టే ప్రయత్నం చేయనంది. భారీ అంచనాల నడుమ విడుదలకానున్న ఈ సినిమాలో మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు
శ్రీను వైట్ల ఈ సినిమాకు దర్శకుడు. తమన్నా హీరోయిన్. 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. థమన్ సంగీతదర్శకుడు. ‘ఆగడు’ ఈ నెల 19న మనముందుకు రానుంది


