‘డెకాయిట్’ పై మృణాల్ కాన్ఫిడెంట్.. ఈసారి హిట్ పడాల్సిందే..!

‘డెకాయిట్’ పై మృణాల్ కాన్ఫిడెంట్.. ఈసారి హిట్ పడాల్సిందే..!

Published on Apr 9, 2026 2:00 PM IST

Dacoit

సీతారామం, హాయ్ నాన్న వంటి క్లాసిక్ హిట్స్‌తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ‘ఏంజెల్’ లాంటి ముద్ర వేసుకున్న మృణాల్ ఠాకూర్, ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒక గట్టి విజయం కోసం ఎదురుచూస్తోంది. ఈ రెండు చిత్రాలు కేవలం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా, నటిగా ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా హోమ్లీ మరియు ఎమోషనల్ పాత్రల్లో మృణాల్ ఒదిగిపోయే తీరుకు యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయిపోయారు.

​అయితే, వరుస విజయాల తర్వాత విజయ్ దేవరకొండ సరసన నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం ఆమెకు కొంత నిరాశను మిగిల్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడంతో, మృణాల్ తన నెక్స్ట్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించింది. ఒక ఫెయిల్యూర్ ఎదురైనప్పటికీ, ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవడం విశేషం. మృణాల్ చేతిలో ప్రస్తుతం కొన్ని ఆసక్తికరమైన పాన్-ఇండియా ప్రాజెక్టులు ఉన్నాయి.

​ముఖ్యంగా రేపు విడుదల కానున్న ‘డెకాయిట్’ (Dacoit)చిత్రంపై మృణాల్ భారీ ఆశలు పెట్టుకుంది. అడివి శేష్‌తో కలిసి ఆమె నటిస్తున్న ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో తన పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుందని ఇప్పటికే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కి తన పరంపరను కొనసాగించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకోవడంలో పేరున్న మృణాల్, ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

తాజా వార్తలు