
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’. పరమేశ్వరా ఆర్ట్ ప్రొడక్షన్ పతాకంపై బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 1న విడుదల చేస్తున్నట్టు నిర్మాత మరోసారి కన్ఫర్మ్ చేశారు.
‘గోవిందుడు అందరివాడేలే’ పచ్చ తోరణంగా, మన ప్రతి కుటుంబంలో కలకాలం నిలిచిపోయే ఫ్యామిలీ ఫోటోగా సింగారించుకుని అక్టోబర్ 1కి మీ ముందుకు రాబోతోంది. ‘అందరివాడు’ మన రామ్ చరణ్ గోవిందుడుగా ముస్తాబై ఈ దసరాని కైవసం చేసుకోడానికి అక్టోబర్ 1కి సిద్ధమైపోతున్నాడు. అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.
కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, కమలిని ముఖర్జీ ముఖ్య పాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

