నిఖిల్ ‘కార్తికేయ’ రిలీజ్ డేట్

నిఖిల్ ‘కార్తికేయ’ రిలీజ్ డేట్

Published on Sep 25, 2014 5:35 PM IST

Nikhil-and-Swathii
యువకధానాయకుడు నిఖిల్, స్వాతి జంటగా నటించిన సినిమా ‘కార్తికేయ’. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ రావడంతో అందరూ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. చాలా రోజులుగా ఈ మూవీ రిలీజ్ పై కొనసాగుతున్న సస్పెన్స్ వీడిపోయింది. తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ 10న ఈ మూవీని రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేసుకుంది.

ఆంధ్ర – తమిళనాడు బార్డర్లో ఒక టెంపుల్ చుట్టూ తిరిగే ఈ థ్రిల్లర్ కథలో విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఈ సినిమా ద్వారా చందు మొండేటి దర్శకుడిగా పరిచయం కానున్నారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా సెన్సార్ నుంచి ‘యు/ఏ’ సర్టిఫికేట్ అందుకుంది.

తాజా వార్తలు