
సౌత్ ఇండియన్ ఫేమస్ డైరెక్టర్స్ లో మణిరత్నం ఒకరు. ఆయనకి ఇటీవల కాలంలో చెప్పుకోదగిన హిట్స్ లేకపోయినప్పటికీ ఆ పేరుకున్న క్రేజ్ మాత్రం తగ్గలేదు.. ప్రస్తుతం ఆయన మలయాళ నటుడు మమ్ముట్టి కుమారుడైన యంగ్ హీరో డల్క్వేర్ సల్మాన్ తో ఓ సినిమా చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. కానీ ఈ సినిమాలో హీరోయిన్ కోసం గత కొద్ది రోజులుగా అన్వేషణ జరుగుతోంది.
ఇప్పటికే అలియా భట్, నిత్యా మీనన్ పేర్లు తెరపైకి వచ్చినా వారు ఆ సినిమాలో చేయడం లేదని తేల్చేసారు. వారి తర్వాత ఆ అవకాశం పూజ హెగ్డేని వరించింది. ప్రతి హీరోయిన్ ఆయన డైరెక్షన్ లో ఎప్పుడు సినిమా చేద్దామా అని ఎదురు చూస్తుంటే తను మాత్రం డేట్స్ లేక ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.
అసలు విషయంలోకి వెళితే పూజ హెగ్డేని మణిరత్నం సినిమా కోసం అప్రోచ్ అయ్యారట, కానీ తనకి డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలియజేసింది. పూజ హెగ్డే తెలుగులో నటించిన ‘ఒక లైలా కోసం’, ‘ముకుంద’ సినిమాలు రిలీజ్ కి సిద్దమవుతుంటే, త్వరలో హృతిక్ రోషన్ సరసన చేయనున్న ‘మొహెంజదారో’ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

