పద్మశ్రీ కి విజయ నిర్మలని రెకమండ్ చేసిన ‘మా’

పద్మశ్రీ కి విజయ నిర్మలని రెకమండ్ చేసిన ‘మా’

Published on Sep 25, 2014 11:50 PM IST

Vijaya-Nirmala
సినిమాలకు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పెండింగ్ లో ఉన్న అన్ని విషయాలను చర్చించడానికి మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్(మా) నిన్న వైజాగ్ లో భేటి అయ్యారు. అక్కడ జరిగిన చర్చల్లో ఈ సారి పద్మశ్రీకి ఎవరిని రెకమండ్ చెయ్యాలా అన్నదాని గురించి కూడా చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో అందరూ ఏకాభిప్రాయంతో నటి, నిర్మాత దర్శకురాలైన విజయ నిర్మలని ఎంపిక చేసారు.

విజయ నిర్మల ఇండస్ట్రీకి ఎన్నో సేవలను అందించారు. అలాగే ఆమె తెలుగు చిత్ర పరిశ్రమకి చేసిన సేవలకి గాను తనకి ఈ అవార్డు ఇవ్వడం న్యాయమేనని అందరూ తీర్మానించారు. లేడి డైరెక్టర్ గా కూడా మహిళల సత్తా చాటిన విజయ నిర్మల గారు 40 సినిమాలకి దర్శకత్వం వహించారు. ఈ సమావేశంలో డిస్ట్రిబ్యూటర్స్ కూడా నిర్మాతల నుంచి పెద్ద సినిమాలకి బడ్జెట్ తగ్గించాలని కోరారు.

తాజా వార్తలు