‘లింగా’లో పోలీస్ ఆఫీసర్ గా బ్రహ్మానందం.

‘లింగా’లో పోలీస్ ఆఫీసర్ గా బ్రహ్మానందం.

Published on Sep 26, 2014 10:20 AM IST

Bramhanandam
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా సినిమా ‘లింగా’లో టాలీవుడ్ సూపర్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం తెలుగు, తమిళ ప్రేక్షకులను నవ్వించే భాద్యతను తీసుకున్నారు. కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బ్రాహ్మి పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారు. రజినీకాంత్ డ్యూయల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లు. ఇటివలే సినిమా టాకీ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేశారు. ‘లింగా’ కోసం హాలీవుడ్ ఫైట్ మాస్టర్ నేతృత్వంలో రజిని డేర్ డెవిల్ స్టంట్స్ చేశారు. త్వరలో పాటల చిత్రీకరణ కోసం యూరోప్ వెళ్లనున్నారు.

ఏఅర్ రెహమాన్ స్వరపరిచిన ‘లింగా’ పాటలను వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రజినీకాంత్ నటించినే అనేక బ్లాక్ బస్టర్ సినిమాలలో ఇంట్రడక్షన్ సాంగ్ పాడిన ఎస్.పి.బాలసుబ్రమణ్యం ఈ సినిమాలోనూ ఇంట్రో సాంగ్ పాడడం విశేషం. రాక్ లైన్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వెంకటేష్ నిర్మిస్తున్న ఈ సినిమా రజిని పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 12న విడుదల చేయనున్నట్టు ప్రకటించిన సంగతి విదితమే.

తాజా వార్తలు