ఎన్.టి.ఆర్ నాన్ స్టాప్ షెడ్యూల్

ఎన్.టి.ఆర్ నాన్ స్టాప్ షెడ్యూల్

Published on Sep 28, 2014 12:00 PM IST

NTR
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో ఓ సినిమా సెట్స్ పై ఉన్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ ఈ సినిమా కోసం ఓ నాన్ స్టాప్ షెడ్యూల్ కోసం సిద్దమవుతున్నాడు. పలు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ గత కొద్ది రోజులుగా ఆగిపోయింది. ఈ సినిమా షూటింగ్ మళ్ళీ ట్రాక్ పైకి రానుంది. ఈ సినిమా కోసం మొత్తం 78 వర్కింగ్ డేస్ అని ఫైనలైజ్ చేసారు. అలాగే ఈ చిత్ర టీం ఇక నుంచి ఆగకుండా నాన్ స్టాప్ గా వర్క్ చేయనున్నారు.

ఈ సినిమాని 2015 జనవరి 9న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ టార్గెట్ ని రీచ్ అవ్వాలి అంటే ఈ మూవీ టీం కంటిన్యూగా వర్క్ చేయాలి. ఎన్.టి.ఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిసున్న ఈ మూవీని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు. ఎన్.టి.ఆర్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు అనడంతో అభిమానుల్లో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు