సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఉన్న క్రేజ్ గురించి మనం కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు, ముఖ్యంగా తమిళనాడులో ముద్దుగా తలైవా అంటూ పిలవడమే కాకుండా భారీ క్రేజ్ అక్కడే ఉంటుంది. ప్రస్తుతం ఈ రేంజ్ క్రేజ్ ఉన్న రజినీ కాంత్ వాయిస్ ని ఓ గవర్నమెంట్ డిపార్ట్ మెంట్ తమ పబ్లిక్ ప్రమోషన్స్ కోసం ఉపయోగించనున్నారు.
ప్రస్తుతం వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం చెన్నై రైల్వే స్టేషన్ లో చేసే సేఫ్టీ అనౌన్స్ మెంట్ లో రజినీకాంత్ వాయిస్ తో వినిపించాలని ప్లాన్ చేస్తున్నారు. ఓ మిమిక్రీ ఆర్టిస్ట్ ని సెలెక్ట్ చేసుకొని అతనితో రజినీలా అనౌన్స్ మెంట్స్ చేయించనున్నారు. దీని వల్ల ట్రాక్స్ పై నుంచి ప్లాట్ ఫార్మ్స్ మారే వారందరూ సూపర్ స్టార్ వాయిస్ విని స్టెప్స్ ద్వారానే వెళ్తారని ఆశిస్తున్నారు. దీనివల్ల సేఫ్టీ అనౌన్స్ మెంట్స్ అన్నిటిలో ప్రజల మైండ్ ని అట్రాక్ట్ చేసి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవచ్చని రైల్వే అఫిషియల్స్ భావిస్తున్నారు.


