
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. కొద్ది రోజులుగా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన ఈ చిత్ర టీం నిన్నటి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ మారాడు. ముందుగా ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎన్నుకున్నారు కానీ తాజా సమాచారం ప్రకారం అనూప్ రూబెన్స్ ని ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నట్లు డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెలిపాడు.
గతంలో కూడా ఓ సారి ఎన్.టి.ఆర్ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ చేసే అవకాశం వచ్చినట్టే వచ్చి మిస్ అయిపోయింది. ఫైనల్ గా ఈ సినిమాతో అనూప్ రూబెన్స్ ఎన్.టి.ఆర్ సినిమాకి మ్యూజిక్ చేసే అవకాశం కొట్టేసాడు. ఎన్.టి.ఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా 2015 జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘బాద్షా’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత బండ్ల గణేష్ ఎన్.టి.ఆర్ తో చేస్తున్న రెండవ సినిమా ఇది.

