జనవరిలో రానున్న గోపీచంద్ – యువి క్రియేషన్స్ మూవీ.!

జనవరిలో రానున్న గోపీచంద్ – యువి క్రియేషన్స్ మూవీ.!

Published on Sep 29, 2014 4:13 PM IST

gopichand
మాచో హీరో గోపీచంద్ నటించిన ‘లౌక్యం’ సినిమా గత శుక్రవారం విడుదలై సూపర్ హిట్ టాక్ తో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఇది కాకుండా గోపీచంద్ నటిస్తున్న మరో సినిమా సినిమా సెట్స్ పై ఉన్న సంగతి ఇదివరకే తెలియజేశాం. ‘మిర్చి’, ‘రన్ రాజా రన్’ లాంటి సక్సెస్ఫుల్ సినిమాలను అందించిన యువి క్రియేషన్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

రాధాకృష్ణ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ఈ సంవత్సరం చివరికల్లా షూటింగ్ తో పాటు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి 2015 జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ జనవరిలో ఎప్పుడు రిలీజ్ చెయ్యాలా అనే అంశంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

గోపీచంద్ సరసన ‘ఊహలు గుసగుసలాడే’ ఫేం రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. గోపీచంద్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కి అందరి నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. మణిశర్మ తనయుడు సాగర్ మహతి ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు