ఎరోస్ సొంతం చేసుకున్న కమల్ ‘ఉత్తమ విలన్’ ఆడియో రైట్స్

ఎరోస్ సొంతం చేసుకున్న కమల్ ‘ఉత్తమ విలన్’ ఆడియో రైట్స్

Published on Sep 30, 2014 12:03 PM IST

Uthama_Villain
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా నటించిన సినిమా ‘ఉత్తమ విలన్’. కమల్ హాసన్ ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ ని పూర్తి చేసారు. ముందుగా ఈ సినిమాని అక్టోబర్ లో రిలీజ్ చెయ్యాలను కున్నారు కాని పోస్ట్ ప్రొడక్షన్ కారణాల వల్ల ప్రస్తుతం కమల్ బర్త్ డే కానుకగా నవంబర్ 7న రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

తాజా సమాచారం ప్రకారం మ్యూజిక్ యువ సంచనలనం జిబ్రాన్ మ్యూజిక్ అందించిన ఉత్తమ విలన్ ఆడియో రైట్స్ ని ఎరోస్ వారు ఫ్యాన్సీ అమౌంట్ కి సొంతం చేసుకున్నారు. అక్టోబర్ లో ఈ మూవీ ఆడియోని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో కమల్ హాసన్ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు. అవే మలయంలో ఫేమస్ అయిన తెయ్యమ్‌ కళాకారుడిగా, మరొకటి సినిమా నటుడిగా కమల్‌హాసన్‌ కనిపిస్తాడు.

రమేష్ అరవింద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కె. బాలచందర్, పూజ కుమార్, ఆండ్రియా, పార్వతి, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తిరుపతి బ్రదర్స్ – రాజ్ కమల్ ఫిల్మ్స్ నిర్మిస్తున్నారు. ఇది కాకుండా కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం 2’ సినిమా త్వరలో విడుదల కానుంది.

తాజా వార్తలు