షాపర్స్ స్టాప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా శృతి హాసన్

షాపర్స్ స్టాప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా శృతి హాసన్

Published on Sep 30, 2014 2:05 PM IST

Shruti_Haasan

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కుమార్తెగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసిన శృతి హాసన్ కొద్ది రోజుల్లోనే తన కంటూ ఓ ప్రత్యెక గుర్తింపుని తెచ్చుకొని తండ్రికి తగ్గ తనయురాలిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. శృతి ప్రస్తుతం హీరోయిన్ గా తెలుగు, తమిళం మరియు హిందీలో వరుసగా సినిమాలు చేస్తూ ఖాళీ సమయం లేకుండా గడుపుతోంది. శృతి హీరోయిన్ గానే కాకుండా బ్రాండ్ అంబాసిడర్ గా చాలా బ్రాండ్స్ కి పనిచేస్తోంది.

తాజాగా శృతి హాసన్ మరో బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేసింది. షాపర్స్ స్టాప్ అనే క్లాత్ స్టోర్ కి బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసింది. అలాగే ఈ బ్రాండింగ్ కోసం శృతికి ఫ్యాన్సీ అమౌంట్ ని ఆఫర్ చేసారని సమాచారం. ప్రస్తుతం శృతి హాసన్ మహేశ్ బాబు – కొరటాల శివ సినిమాలో నటిస్తోంది. ఇది కాకుద్నా తమిళంలో విశాల్ సరసన బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ సరసన ఓ సినిమా చేసింది. ఇది కాకుండా పలు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు