దీపావళి కానుకగా నిఖిల్ ‘కార్తికేయ’ విడుదల..!

దీపావళి కానుకగా నిఖిల్ ‘కార్తికేయ’ విడుదల..!

Published on Oct 2, 2014 2:50 PM IST

Karthikeya
యంగ్ హీరో నిఖిల్, కలర్స్ స్వాతి జంటగా నటించిన తాజా సినిమా ‘కార్తికేయ’. ఈ సినిమా అక్టోబర్ 24న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. థ్రిల్లర్ కధాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో గ్రాఫిక్ వర్క్స్ కి చాలా ప్రాముఖ్యత ఉండడంతో నిర్మాణంతర కార్యక్రమాలు పూర్తవడానికి కొంచం ఎక్కువ సమయమే పట్టింది. సెప్టెంబర్ నెలలో ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ అయ్యింది. పెద్ద సినిమాల జాతర పూర్తయిన తర్వాత విడుదల చేద్దామని నిర్మాతలు ఇన్ని రోజులు వెయిట్ చేశారు. అక్టోబర్ 17న ‘కరెంట్ తీగ’, ‘ఒక లైలా కోసం’ విడుదల అవుతుండడంతో తర్వాత శుక్రవారం దీపావళి కానుకగా సినిమాను విడుదల చేస్తున్నారు.

సుబ్రమణ్యస్వామి గుడి నేపధ్యంలో సినిమా సాగుతుంది. ఈ సినిమా ద్వారా చందు మొండేటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘స్వామి రా రా’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నిఖిల్, స్వాతి మెడికల్ కాలేజీ విద్యార్ధులుగా నటించారు. శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ‘మాగ్నస్ సినీ ప్రైమ్’ బ్యానర్ ద్వారా వెంకట్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

తాజా వార్తలు