గతంలో తన సినిమాలలో పాటలు పాడిన కమల్ హాసన్. మరోసారి గొంతు సవరించుకున్నారు. అంతా కొత్త నటీనటులతో తెరకెక్కుతున్న ఓ చిన్న సినిమాలో కమల్ పాట పాడడం విశేషం. న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేసే కమల్, ‘అవం’ అనే తమిళ సినిమాలో పాట పాడారు.
‘కారిరులే..’ అంటే సాగే ఈ పాటకు సుందరమూర్తి సంగీతం అందించారు. మదన్ కర్కి లిరిక్స్ రాశారు. తాను రచించిన పాటను కమల్ పాడడంతో చాలా సంతోషంగా ఉన్నారు లిరిక్స్ రైటర్ మదన్ కర్కి. సినిమాలో ఈ పాట హైలైట్ అవుతుందని, కమల్ వాయిస్ పాటకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యింది. నా పాటకు కమల్ ప్రాణం పోశారు అని మదన్ అన్నారు. ఇటివలే ఈ పాట రికార్డింగ్ పూర్తయింది. విజయ్, కార్తీక్, గౌరవ్ హీరోలుగా నటిస్తున్న సినిమాను విజె ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తుంది. విజయ్ నటించడంతో పాటు దర్శకత్వ భాద్యతలను నిర్వర్తిస్తున్నారు.


