
ఈ నెల 24న నిఖిల్ నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ కార్తికేయ విడుదలకానుంది. ఈ సినిమా గురించి, సినిమా కధ గురించి లెక్కలేనన్ని పుకార్లు గాలి వార్తలు ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతున్నాయి.
వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఆ సినిమా కధను చిన్న చిన్న పార్ట్లుగా రివీల్ చేసాడు. అతని ప్రకారం ఒక చోట ఒకే రీతిలో జరిగే వరుస హత్యల నేపధ్యంలో ఈ సినిమా స్టొరీని డెవలప్ చేసారు. దానికి ఒక ముసివేయబడ్డ దేవాలయానికి గల సంబంధం ఏమిటి అన్నది సస్పెన్స్ అంటున్నాడు. చందూ మొందేటి దర్శకుడు. ఈ సినిమాలో నిఖిల్ సరసన కలర్స్ స్వాతి నటించింది

