
ఊహలు గుసగుసలాడే సినిమాలో నటించిన నాగ శౌర్య తదుపరి చిత్రం దిక్కులు చూడకు రామయ్య అని మనక తెలిసిన విషయమే.ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తిచేసుకుంది. ఇటీవలే విడుదలైన పాటలకు కూడా మంచి స్పందన లభించింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదలకానుంది. రషెస్ చూసిన ప్రముఖులు సినిమాకు మంచి బిజినెస్ చేసే స్టామినా వున్నట్టు తెలిపారు.
సాయి కొర్రపాటి నిర్మాణంలో వారాహి చలన చిత్ర బ్యానర్ లో ఈ సినిమా నిర్మాణమవుతుంది. రాజమౌళి దగ్గర శిష్యరికం చేసిన త్రికోటి ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రం అక్టోబర్ 10న విడుదలకానుంది

