
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘గోవిందుడు అందరివాడేలే’. దసరా కానుకగా అక్టోబర్ 1న రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ మెప్పు పొందుతూ ఆడియన్స్ ని థియేటర్స్ కి రాబట్టుకుంటోంది. ఇదొక క్లాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అవడం వల్ల యుఎస్ లో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టుకుంటోంది.
మాకు అందిన సమాచారం ప్రకారం బుధవారం నుంచి శుక్రవారం వరకూ ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా $400,000 డాలర్స్ (ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు 2.46 కోట్లు) కలెక్ట్ చేసింది. మేము అందించినది శుక్రవారం వరకూ వచ్చిన రిపోర్ట్ మాత్రమే వీకెండ్ శని, ఆది వారల్ల్లో యుఎస్ లో రామ్ చరణ్ గతంలో చేసిన మాస్ సినిమాలకంటే ఈ సినిమా కలెక్షన్ రిపోర్ట్ బాగుందని ట్రేడ్ పండితులు అంటున్నారు.
రామ్ చరణ్ – కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమాకి కృష్ణవంశీ డైరెక్టర్. ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీ కాంత్, కమలినీ ముఖర్జీలు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి బండ్ల గణేష్ నిర్మాత.

