
బాక్స్ ఆఫీసు వద్ద అందుకున్న యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా ‘గుండెల్లో గోదారి’ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహించిన సినిమా ‘జోరు’. సందీప్ కిషన్ సరసన రాశి ఖన్నా, ప్రియ బెనర్జీ, సుష్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ చిత్ర టీం ముందుగా ఈ సినిమా ఆడియోని అక్టోబర్ 5న రిలీజ్ చెయ్యాలనుకున్నారు. కానీ చిన్న సమస్య వల్ల ఆడియోని అక్టోబర్ 6కి వాయిదా వేసారు.
రేపు ఈ సినిమా ఆడియోని జె.ఆర్.సి కన్వెన్షన్ హాల్ హాల్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ ఆడియో వేడుకకి యంగ్ హీరోస్ అంతా హాజరయ్యే అవకాశం ఉంది. భీమ్స్ మ్యూజిక్ అందించాడు. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ఈ సినిమాని నవంబర్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. శ్రీ కీర్తి ఫిల్మ్స్ బ్యానర్ పై అశోక్ బాబా – నాగార్జున కలిసి ఈ సినిమాని నిర్మించారు.

