
సూపర్ స్టార్ మహేష్ హీరోగా బ్యూటిఫుల్ లేడీ శృతి హాసన్ జంటగా నటిస్తున్న సినిమా ప్రసతుతం సెట్స్ పై ఉంది. ప్రసతుతం ఈ మూవీలోని నటీనటులపై కొన్ని సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. త్వరలోనే మహేష్ బాబు – శృతి హాసన్ ఈ మూవీ షూటింగ్ లో పాల్గొననున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారు కాలేదు.
ప్రసతుతం ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న పుకార్ల ప్రకారం ఈ సినిమాకి ‘మగాడు’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. కానీ ఇదే ఫైనల్ టైటిల్ కాదు. పవర్ఫుల్ మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కనున్న ఈ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ని సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్నారు.

