టాక్స్ మినహాయింపు కోసం కెసిఆర్ ని కలిసిన గుణశేఖర్

టాక్స్ మినహాయింపు కోసం కెసిఆర్ ని కలిసిన గుణశేఖర్

Published on Oct 7, 2014 12:46 PM IST

rudhramadevi-guna-shekar
భారీ బడ్జెట్ మరియు భారీ సెట్స్ స్పెషలిస్ట్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన మొట్ట మొదటి స్టీరియో స్కోపిక్ 3డి పీరియాడిక్ ఫిల్మ్ ‘రుద్రమదేవి’. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాకి ఎంటర్టైన్మెంట్ టాక్స్ మినహాయింపు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కె. చంద్రశేఖర్ రావుని కలిసారు.

గుణశేఖర్ కెసిఆర్ ని కలిసి కాకతీయుల కాలంలో తెలంగాణాలోని చాలా ప్రాంతాన్ని పరిపాలించిన రుద్రమదేవి కథాశంతో తెరకెక్కిన సినిమా అని చెప్పి ఎంటర్టైన్మెంట్ టాక్స్ అనేది ఈ సినిమాకి మినహాయింపు చేయాలని కోరాడు. తెలంగాణా చరిత్రలో రుద్రమదేవి కూడా ప్రధమురాలు మరియు ఈ సినిమాలో తెలంగాణ సంస్కృతికి సంబందించిన విషయాలు చాలా ఉండడం వలన కెసిఆర్ తన విన్నపాన్ని మన్నించి ‘రుద్రమదేవి’ సినిమాకి ఎంటర్టైన్మెంట్ టాక్స్ ఎత్తి వేస్తారని గుణశేఖర్ ఆశిస్తున్నాడు.

అనుష్క రుద్రమదేవిగా కనిపించనున్న ఈ సినిమాలో చాళుక్యవీరభద్రుడిగా రానా కనిపిస్తాడు. అలాగే అల్లు అర్జున్ గోనగాన్నారెడ్డి పాత్రలో కనిపిస్తాడు. ఇళయరాజా మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి తోట తరణి అద్భుతమైన అలనాటి కట్టడాలని సెట్స్ గా రూపకల్పన చేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు